Monday, 6 July 2015

డాక్టర్ కాలర్‌ని పట్టుకున్న మంత్రి...!

ఈ ఫోటో ఓ రాష్ర్టానికి చెందిన ఆరోగ్యశాఖమంత్రిది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ తిరిగేస్తోంది. అసలు మంత్రి పబ్లిక్‌గా ఓ లేడీ డాక్టర్ కాలర్ ఎందుకు పట్టుకున్నారంటూ నెట్టింట ప్రశ్నల మీద ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ- పీడీపీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని రూలింగ్ చేస్తోంది. అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా బీజేపీ నేత, ఆ రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి చౌదరీ‌లాల్ సింగ్.. లఖన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుప్రతిని సందర్శించారు.
3 ఈ సందర్భంగా ఓ మహిళా డాక్టర్ తన కోటు కాలర్ సరిగా పెట్టుకోక పోవడాన్ని గమనించిన మంత్రి.. దాన్ని సరిచేశారు. ఇదంతా గమనించిన మరో డాక్టర్ తనంతట తానే కాలర్‌ను సరి చేసుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఐతే, డాక్టర్ కాలర్‌ను మంత్రి సరిచేసే సమయంలో అక్కడ చాలామంది వున్నారు. రాష్ర్టానికి మంత్రి అయిన చౌదరీ, పబ్లిక్‌గా ఇలా వ్యవహరించడంపై వెబ్‌లో రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి. అదే మంత్రిపై ఈ డాక్టర్‌ను మానసికంగా వేధించారంటూ మీడియాల్లో తెగ స్ర్కోలింగులు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లివెత్తాయి.. ఇంతలో డాక్టర్ కాలర్‌ని మంత్రి సరిచేసాడన్న ప్రచారం తెరపైకి  రావడంతో  అంతా చల్లబడ్డారు.